బెంగళూరులో ధ్రువ్-NG హెలికాప్టర్‌ ప్రారంభం.. కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

భారతదేశపు అడ్వాన్స్‌డ్ లైట్ సివిల్ హెలికాప్టర్ ‘ధ్రువ్–NG’ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు మంగళవారం బెంగళూరులో ప్రారంభించారు.

బెంగళూరులో ధ్రువ్-NG హెలికాప్టర్‌ ప్రారంభం.. కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారతదేశపు అడ్వాన్స్‌డ్ లైట్ సివిల్ హెలికాప్టర్ ‘ధ్రువ్–NG’ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు మంగళవారం బెంగళూరులో ప్రారంభించారు. హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (HAL) అభివృద్ధి చేసిన ఈ హెలికాప్టర్‌ పౌర, వాణిజ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. ప్రస్తుతం సేవల్లో ఉన్న ధ్రువ్ హెలికాప్టర్లతో పోలిస్తే ధ్రువ్–NG మరింత మెరుగైన పనితీరు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అధిక భద్రతా ప్రమాణాలతో అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు. ప్రారంభ కార్యక్రమం అనంతరం హెలికాప్టర్‌లోని అధునాతన వ్యవస్థలు, సదుపాయాలను కేంద్ర మంత్రి సమగ్రంగా పరిశీలించారు.

గ్లోబల్ విమానయాన తయారీ హబ్‌గా భారత్..

ఈ సందర్భంగా మంత్రి రామ్మోహన్‌ నాయుడు మాట్లాడుతూ, భారతీయ పౌర విమానయాన రంగంలో ఇది ఒక చారిత్రాత్మక ‘లిఫ్ట్ ఆఫ్’. HAL రూపొందించిన ధ్రువ్–NG తొలి పరీక్షా విమానం ఆత్మనిర్భర భారత్ దిశగా మరో కీలక మైలురాయి.. అని అన్నారు. పూర్తిగా మేడ్ ఇన్ ఇండియాగా రూపొందిన ఈ రోటరీ వింగ్ హెలికాప్టర్ దేశీయ ఇంజినీరింగ్ ప్రతిభకు గర్వకారణమని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ ‘ఇంపోర్ట్ డిపెండెన్సీ’ నుంచి ‘ఇండిజెనస్ రిలయబిలిటీ’ వైపు వేగంగా అడుగులు వేస్తోందని తెలిపారు. దేశీయ శక్తి ఇంజిన్‌తో రూపొందిన ధ్రువ్–NG హెలికాప్టర్ గ్లోబల్ విమానయాన తయారీ హబ్‌గా భారత్ ఎదుగుదలకు మరింత బలం చేకూరుస్తుందని మంత్రి వెల్లడించారు. ధ్రువ్–NG విజయవంతమైన అభివృద్ధితో భారత పౌర విమానయాన రంగం అంతర్జాతీయ స్థాయిలో మరింత పోటీతత్వాన్ని సాధిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Next Story