- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి అరెస్ట్‌పై అలసత్వం.. పోలీసుల తీరుపై డీజీపీ సీరియస్
మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి అరెస్ట్‌పై అలసత్వంపై డీజీపీ సీరియస్ అయ్యారు..

దిశ, వెబ్ డెస్క్: రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి(Former MLA of Raptadu Topudurthi Prakash Reddy)పై ఇప్పటి వరకూ యాక్షన్ తీసుకోకపోవడంపై రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా(DGP Harish Kumar Gupta) సీరియస్ అయ్యారు. వైసీపీ అధినేత జగన్ పర్యటన నేపథ్యంలో శ్రీసత్యసాయి జిల్లా కుంటిమద్ది హెలీప్యాడ్(Sri Sathya Sai District Kuntimaddi Helipad) వద్ద పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన ఘటనపై ఇప్పటి వరకూ తోపుదుర్తిని అదుపులోకి తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 రోజులుగా తోపుదుర్తి తప్పించుకుని తిరుగుతుంటే పోలీసుల ఏం చేస్తున్నారంటూ.. పూర్తి నివేదిక ఇవ్వాలని సత్యసాయి జిల్లా ఎస్పీని ఆదేశించారు.
కాగా జగన్ హెలీప్యాడ్ వద్ద స్థానిక వైసీపీ నేతలతో పాటు తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సైతం పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. దీంతో చెన్నేకొత్తపల్లి, రామగిరి మండలాలకు చెందిన 11 మంది వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కీలక వైసీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. మరికొంతమంది పరారీలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సైతం పరారీలో ఉన్నారు. 20 రోజులుగా పోలీసుల కళ్లు కప్పి విజయవాడ, హైదరాబాద్ తో పాటు బెంగళూరులో తిరుగుతున్నారన్న సమాచారంతో ఆయన కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తు్న్నారు. అయితే తోపుదుర్తి అరెస్ట్ వ్యవహారంలో మాత్రం అలసత్వం వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఓ డీఎస్పీ, సీఐ ప్రమేయం ఉన్నట్లు ఉన్నతాధికారులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. దీంతో స్థానిక పోలీసులపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తోపుదుర్తిని అరెస్ట్ చేస్తారేమో చూడాలి.






