ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలి.. డీజీపీ కీలక ఆదేశాలు

by Ajay Maddhiboyina |

ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసు అధికారులు అప్ర‌మత్తంగా ఉండాల‌ని డీజీపీ ఆదేశించారు. మారేడుమిల్లి ఎన్ కౌంట‌ర్ నేప‌థ్యంలో బ‌ల‌గాలు అప్ర‌మ‌త్తం అవ్వాల‌ని సూచించారు. ఏవోబీలో నిఘా పెంచాల‌ని, వాహ‌నాలు త‌నిఖీ చేయాల‌ని చెప్పారు. ఇక రాష్ట్రంలో వ‌రుస ఎన్ కౌంట‌ర్ల‌తో పాటు మ‌రికొంద‌రు మావోయిస్టుల‌

ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలి.. డీజీపీ కీలక ఆదేశాలు
X

దిశ‌, వెబ్ డెస్క్: ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసు అధికారులు అప్ర‌మత్తంగా ఉండాల‌ని డీజీపీ ఆదేశించారు. మారేడుమిల్లి ఎన్ కౌంట‌ర్ నేప‌థ్యంలో బ‌ల‌గాలు అప్ర‌మ‌త్తం అవ్వాల‌ని సూచించారు. ఏవోబీలో నిఘా పెంచాల‌ని, వాహ‌నాలు త‌నిఖీ చేయాల‌ని చెప్పారు. ఇక రాష్ట్రంలో వ‌రుస ఎన్ కౌంట‌ర్ల‌తో పాటు మ‌రికొంద‌రు మావోయిస్టుల‌ను ప‌ట్టుకోవ‌డంతో ప్ర‌భావిత జిల్లాలో ఇప్ప‌టికే హైఅల‌ర్ట్ ప్ర‌క‌టించారు. రాష్ట్రంలో మొత్తం 50మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో విజయవాడలో 28మందిని అదుపులోకి తీసుకోగా, ఏలూరులో 15మందిని ఇతర ప్రాంతాల్లో మిగితావారిని పట్టుకున్నారు. మరోవైపు కొంత‌మంది మావోయిస్టులు పారిపోయి ఉంటార‌ని అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో బ‌ల‌గాలు అడ‌విని జ‌ల్లెడ ప‌డుతున్నారు. ముమ్మ‌రంగా కూంబింగ్ నిర్వ‌హిస్తున్నారు. పాడేరు ఏజెన్సీలోని వార‌పు సంత‌ల‌పైనా పోలీసులు నిఘా పెంచారు. 11 పోలీస్ స్టేష‌న్ ల‌ను నిఘా వ‌ర్గాలు అప్ర‌మ‌త్తం చేశాయి.

Next Story