- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి సగంరోజు సమయం
కలియుగ ఇలవైకుంఠంగా విరాజిల్లుతోన్న తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ప్రతినిత్యం వేలాది మంది భక్తులు విచ్చేస్తారు.

దిశ, వెబ్‌డెస్క్: కలియుగ ఇలవైకుంఠంగా విరాజిల్లుతోన్న తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ప్రతినిత్యం వేలాది మంది భక్తులు విచ్చేస్తారు. పండుగలు, వారాంతాలు, వరుస సెలవులున్నపుడు తిరుమలలో భక్తుల రద్దీ అమాంతం పెరుగుతుందన్న విషయం తెలిసిందే. బుధవారం (ఫిబ్రవరి 11) తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉందని టీటీడీ తెలిపింది. ఉచిత దర్శనం కోసం 15 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 3-5 గంటల సమయం పడుతుండగా.. రూ.300 శీఘ్రదర్శనానికి 2-3 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. నిన్న (మంగళవారం) స్వామివారిని 73,983 మంది భక్తులు దర్శించుకోగా.. 21,900 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా స్వామివారి హుండీ ఆదాయం రూ.4.23 కోట్లు వచ్చింది.
ఈ ప్రాంతాల్లో టోకెన్లు..
శ్రీవారి మెట్టు మార్గంలో, అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్ లో భక్తులకు ప్రతి రోజూ మధ్యాహ్నం 1.00 లేదా 1.30 గంటల నుండి టోకెన్లు ఇస్తారు. అక్కడ తీసుకున్న టోకెన్ ని శ్రీవారిమెట్టు మార్గంలో 1200వ మెట్టు వద్ద తప్పనిసరిగా స్కానింగ్ చేయించుకోవాలి.






