- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో భక్తుల రద్దీ ఇలా.. 18 కంపార్టుమెంట్లు ఫుల్
by Naga Rani Yarlagadda |
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 18 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణంగా ఉందని టీటీడీ తెలిపింది. 18 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎదురుచూస్తుండగా.. టోకెన్లు లేని వారికి శ్రీవారి దర్శనానికి 8-10 గంటల సమయం పడుతుందని తెలిపింది. సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు 3-5 గంటలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2-3 గంటల సమయం పడుతుందని టీటీడీ పేర్కొంది. భక్తుల రద్దీని బట్టి స్వామివారి దర్శన సమయం పెరగవచ్చు లేదా తగ్గవచ్చని, భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరింది. నిన్న (ఆదివారం) మహాశివరాత్రి పర్వదినం నేపథ్యంలో తిరుమలకు భక్తులు పోటెత్తారు. 80,502 మంది శ్రీవారి దర్శనం చేసుకోగా.. 24,608 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు చెల్లించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.3.74 కోట్లు సమకూరింది.
Next Story






