తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. అతి తక్కువ సమయంలోనే స్వామివారి దర్శనం

by Naga Rani Yarlagadda |

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నట్లు టీటీడీ వెల్లడించింది.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. అతి తక్కువ సమయంలోనే స్వామివారి దర్శనం
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నట్లు టీటీడీ వెల్లడించింది. గురువారం ఉదయం 8 గంటల సమయానికి టోకెన్లు లేకుండా 5 కంపార్టుమెంట్లలో భక్తులు ఉచిత శ్రీవారి దర్శనం కోసమై ఎదురుచూస్తున్నట్లు టీటీడీ తెలిపింది. వారికి స్వామివారి దర్శనానికి 6 గంటలు, సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు ఉన్నవారికి 3-5 గంటలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2-3 గంటల సమయం పడుతుందని తెలిపింది. కొత్తగా క్యూలైన్లోకి వెళ్లే భక్తులకు స్వామివారి దర్శనానికి 6-10 గంటల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. భక్తుల రద్దీని బట్టి దర్శన సమయాలు పెరగవచ్చు, లేదా తగ్గవచ్చని చెప్పింది. కాగా.. నిన్న (బుధవారం) స్వామివారిని 72,017 మంది దర్శించుకోగా.. 26,863 మంది స్వామివారికి తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.4.17 కోట్లు సమకూరినట్లు టీటీడీ తెలిపింది.

Next Story