- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో భక్తుల రద్దీ ఫుల్..
by Naga Rani Yarlagadda |
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: వీకెండ్‌లో తిరుమలకు భక్తుల రద్దీ ఫుల్లుగా ఉంటుందన్న విషయం తెలిసిందే. నేడు కూడా అదే పరిస్థితి నెలకొంది. తిరుమలలో స్వామివారి దర్శనార్థం వేచిచూసే భక్తులతో 31 కంపార్టుమెంట్లు ఫుల్లయ్యాయి. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. అలాగే సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు కలిగిన భక్తులకు సుమారు 4-6 గంటల సమయం పడుతుందని, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3-4 గంటలు పడుతుందని తెలిపింది. నిన్న (శుక్రవారం) స్వామివారిని 66,855 మంది భక్తులు దర్శించుకోగా.. 26,690 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు వివిధ రూపాల్లో సమర్పించిన కానుకలు ద్వారా హుండీ ఆదాయం రూ.3.82 కోట్లు సమకూరింది.
Next Story






