- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. శ్రీవారి దర్శనానికి భారీగా సమయం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనార్థం 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం ఉదయానికి శ్రీవారిని దర్శించుకునేందుకు 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. టోకెన్లు లేనివారికి సర్వదర్శనం అయ్యేందుకు 15 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 4-6 గంటల సమయం పడుతుందని వెల్లడించింది. అలాగే రూ.300 శీఘ్రదర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు 3-4 గంటల సమయం పడుతుందని పేర్కొంది. నిన్న (సోమవారం) 72,526 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. 26,664 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు ధన, వస్తురూపేణ సమర్పించిన కానుకల విలువ రూ.4.41 కోట్లు ఉంటుందని టీటీడీ వివరించింది.
Next Story






