- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలకు పోటెత్తిన భక్తులు.. సప్తగిరి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు.

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఈ క్రమంలో భక్తుల(Devotees) రద్దీ కొన్ని సార్లు సాధారణంగా, కొన్ని సార్లు ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇవాళ(శనివారం) తిరుమలకు ఒక్కసారిగా వాహనాల రద్దీ పెరిగింది. సప్తగిరి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్(Traffic jam) అయ్యింది. అలిపిరి చెక్ పాయింట్ వద్ద వాహనాలు బారులు తీరాయి.
వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే భద్రతా(Security) సిబ్బంది తిరుమలకు వెళ్లడానికి అనుమతిస్తున్నారు. అయితే.. రేపటి (జనవరి 19)తో శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనం ముగియనుండటంతో తిరుమలలో అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. ఈనెల 10 నుంచి 19 వరకు అంటే దాదాపు పది రోజుల పాటు శ్రీవారి ఆలయంలో భక్తులకు టీటీడీ(TTD) వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తోంది. రేపు అర్ధరాత్రి శ్రీవారి ఆలయంలోని వైకుంఠ ద్వారాలను టీటీడీ మూసివేయనుంది.






