- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమలకు పోటెత్తిన భక్తులు.. ఊహించని షాక్ ఇచ్చిన టీటీడీ
వరుస సెలవులు కావడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా పోటెత్తారు..

దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala)కు భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు కావడంతో శ్రీవారి(Srivaru)ని దర్శించుకునేందుకు కుటుంబ సమేతంగా తరలివస్తున్నారు. దీంతో తిరుమలగిరులు(TirumalaGirulu) ఇసుక వేస్తే రాలనంత భక్తులు చేరుకున్నారు. ఉదయం శ్రీవారిని దర్శనానికి 24 గంటల సమయం పట్టగా రెండు గంటల్లోనే అనూహ్యంగా భక్తులు భారీగా వచ్చారు. దీంతో కంపార్టుమెంట్లు, క్యూలైన్లు మొత్తం ఫుల్ అయి పోయాయి. క్యూలైన్ల వెలుపల 5 కిలో మీటర్లకు పైగానే భక్తులు వేచిఉన్నారు. భక్తులు అనూహ్యంగా పెరగడంతో టీటీడీ మరింత అప్రమత్తమైంది. భక్తులకు అన్ని విధాలుగా సౌకర్యాలు అందిస్తోంది. శ్రీవారి దర్శనం 48 గంటల సమయం పడుతోంది. ఈ మేరకు తిరుమల వీధుల్లో ప్రచారం చేస్తోంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని కొత్తగా వచ్చే భక్తులు దర్శన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దీంతో పలువురు భక్తులు వెను తిరిగి వెళ్లిపోతున్నారు. ప్రస్తుతం తిరుమలలో భారీగా భక్తులు ఉండటంతో ఇంకోసారి స్వామివారిని దర్శించుకుంటామని చెబుతున్నారు.






