తిరుమలకు పోటెత్తిన భక్తులు.. అలిపిరి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్

by Vemula.Srinu Prasad |

తిరుమలకు భక్తులు భారీగా పోటెత్తారు. శని, ఆదివారాలు కావడంతో భక్తులు కుటుంబ సమేతంగా వెంకన్న కొండకు భారీగా తరలివచ్చారు. ..

తిరుమలకు పోటెత్తిన భక్తులు.. అలిపిరి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala)కు భక్తులు(Devotees) భారీగా పోటెత్తారు. శని, ఆదివారాలు కావడంతో భక్తులు కుటుంబ సమేతంగా వెంకన్న కొండకు భారీగా తరలివచ్చారు. రైళ్ల నుంచే కాకుండా సొంత వాహనాల్లో వెంకన్న కొండను చేరుకున్నారు. రేపు ఆదివారం కావడంతో శనివారం సాయంత్రం నుంచి అలిపిరి వద్ద రద్దీ మరీ ఎక్కువైంది. వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత కొండపైకి అనుమతిస్తున్నారు. దీంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర అలిపిరి వాహనాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు వీడియోలు తీసి పలువురు భక్తులు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. అలిపిరి వద్ద రద్దీని వివరిస్తున్నారు. దీంతో ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. మరోవైపు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లు మొత్తం నిండి క్యూలైన్ల బయట వరకూ భక్తులు వేచివున్నారు.

Next Story