- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలకు పోటెత్తిన భక్తులు.. రథ సప్తమి నేపథ్యంలో ముందుగానే ఫుల్ రష్
by Vemula.Srinu Prasad |
రథ సప్తమి నేపథ్యంలో తిరుమలకు ముందుగానే భక్తులు పోటెత్తారు..

X
దిశ, వెబ్ డెస్క్: రథ సప్తమి వేడుకల(Ratha Saptami celebrations)కు తిరుమల(Tirumala) ముస్తాబైంది. ఆదివారం ఈ వేడకలు నిర్వహించేందుకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే తిరుమల కొండపై భక్తులు(Devotees) ఇప్పటికే ఫుల్ అయిపోయారు. తెల్లవారుజామునే శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. వీకెండ్, ఆదివారం స్కూళ్లు, కాలేజీలకు సెలవులు కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమల కొండకు చేరుకున్నారు. ముందుస్తుగా గ్యాలరీల్లోకి చేరుకున్నారు. అయితే గదుల కేటాయించడంకష్టంగా మారింది. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్నా గదులు కేటాయించడం లేదంటూ ఆరోపిస్తున్నారు. దీంతో ఆదివారం తెల్లవారుజామున గదులు ఇస్తామని అధికారులు చెబుతున్నారు.
Next Story






