- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ghat Road: శ్రీశైల క్షేత్రానికి పోటెత్తిన భక్తులు.. ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్
భక్తుల తాకిడి ఒక్కసారిగా పెరగడంతో శ్రీశైలం ఘాట్ రోడ్డు వాహనాలతో కిటకిటలాడుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: శ్రీశైల మల్లికార్జున స్వామి టెంపుల్‌కి ఉగాది మహోత్సవాల సందడి నెలకొంది. పండుగ పురస్కరించుకుని భక్తుల తాకిడి ఒక్కసారిగా పెరగడంతో శ్రీశైలం ఘాట్ రోడ్డు వాహనాలతో కిటకిటలాడుతోంది. తెలుగు రాష్ట్రాల భక్తులే కాకుండా ముఖ్యంగా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర నుండి వేలాది సంఖ్యలో భక్తులు తరలిరావడంతో క్షేత్ర పరిసరాల్లో పండగ వాతావరణం కనిపిస్తోంది.
స్తంభించిన ట్రాఫిక్.. ఇబ్బందుల్లో భక్తులు
వాహనాల రాకతో పాటు, వివిధ ప్రాంతాల నుంచి పాదయాత్రగా వస్తున్న భక్తుల రద్దీ కారణంగా ఘాట్ రోడ్డులో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఎండ తీవ్రతకు తోడు ట్రాఫిక్ సమస్య తోడవ్వడంతో అటు వాహనదారులు, ఇటు పాదయాత్ర భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు, దేవస్థానం అధికారులు అప్రమత్తమయ్యారు. ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టారు. ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలను క్లియర్ చేసే పనిలో అధికారులు ఉన్నారు.






