- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అరసవల్లికి పోటెత్తిన భక్తులు.. భక్తులకు కలెక్టర్ వినతి
నిజ రూపంలో దర్శనమిస్తున్న సూర్యనారాయణ స్వామివారు.

దిశ, వెబ్ డెస్క్ : శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలో రథ సప్తమి (Ratha Saptami) వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు దేవాలయాలను (Temples) సందర్శిస్తున్నారు. జిల్లాలోని ప్రముఖ అరసవల్లి సూర్యనారాయణ దేవాలయానికి (Arasavalli Suryanarayana Temple) భక్తులు ఒక్కసారిగా పోటెత్తారు. మూడు రోజులుగా జరుగుతున్న రథ సప్తమి ఉత్సవాలకు భారీ ఎత్తున భక్తులు హాజరవుతూ ఉన్నారు. భక్తులకు స్వామివారు నిజరూప దర్శనం ఇస్తున్న నేపథ్యంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. పండుగపూట కావడంలో ఒకేసారి వేలాది మంది సూర్యనారాయణ స్వామి దేవాలయానికి చేరుకున్నారు. దీని వల్ల ఆలయ ప్రాంగణంతో పాటు పరిసరాలు కూడా ఇసుక వేస్తే రాలనంత భక్త జనులతో కిక్కిరిసిపోయాయి. అంచనాకు మించిన రద్దీ ఉండడంతో వారిని నియంత్రించడానికి పోలీసులకు, సిబ్బందికి కొంత ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలో వీఐపీ మెయిన్ ఎంట్రన్స్ వద్దకు భక్తులు భారీగా చేరుకోగా.. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాసేపు తోపులాట జరిగి భక్తులు ఇబ్బందిపడినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. భక్తులు ఉదయం 11 గంటల తరువాత స్వామివారి దర్శనానికి రావాలని విన్నవించారు.






