- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ditva Cyclone Effect: తిరుమలలో భక్తులు తీవ్ర ఇబ్బందులు
తిరుమలలో భారీగా కురుస్తున్న వర్షాలతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు...

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి(Tirupati) జిల్లాలో భారీగా వర్షం కురుస్తోంది. దిత్వా తుపాను(Ditva Cyclone) నేపథ్యంలో ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. దీంతో తిరుమల(Tirumala) భక్తులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీవారి కొండపై చలితో పాటు ఈదురు గాలులు వీస్తుండటంతో భక్తులు అవస్థలు పడుతున్నారు. దీంతో టీటీడీ(TTD) అధికారులు అప్రమత్తమయ్యారు. భక్తులు జాగ్రత్తులు పాటించాలని సూచించారు. కొండచరియలు విరిగి పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అటువైపు వెళ్లొద్దని తెలిపారు. చెట్ల కిందకు సైతం వెళ్లొద్దని హెచ్చరించారు. వర్షం నేపథ్యంలో క్యూలైన్లలో ఉండకుండా దర్శనానికి కంపార్టుమెంట్లకు వెళ్లాలని సూచించారు. వీలైతే వర్షం తగ్గే వరకు గదులకు వెళ్లాలని తెలిపారు. గదులు దొరక్క ఆరు బయట ఉన్న భక్తులు అవస్థలు పడుతున్నారు. రెండు రోజుల పాటు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో అప్రమత్తత ప్రకటించారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు






