శ్రీవారికి భారీగా ఆదాయం.. నిన్న ఒక రోజే ఎన్ని కోట్లు వచ్చిందంటే..?

by Vemula.Srinu Prasad |

తిరుమల శ్రీవారికి భారీగా ఆదాయం వచ్చింది....

శ్రీవారికి భారీగా ఆదాయం.. నిన్న ఒక రోజే ఎన్ని కోట్లు వచ్చిందంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala) శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. వీకెండ్ కావడంతో కుటుంబ సమేతంగా తరలివచ్చి కలియుగ దైవాన్ని దర్శించి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇలా శుక్రవారం 66 వేల 709 మంది భక్తులు దర్శించుకున్నారు. శనివారం సైతం భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం శ్రీవారి సర్వ దర్శనానికి 12గంటల సమయం పడుతోంది. అటు శ్రీవారి హుండీ ఆదాయం సైతం రోజు రోజుకు పెరుగుతోంది. శుక్రవారం ఒక్క రోజు రూ. 4.03 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమలలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. భక్తులు క్యూలైన్లలో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.

Next Story