- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Video:తిరుమలలో అర్ధరాత్రి భక్తుల ఆందోళన.. కారణం ఏంటంటే?
కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు.

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఈ క్రమంలో శ్రీ వారి దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉంటారు. ఈ తరుణంలో నిన్న(శుక్రవారం) అర్ధరాత్రి తిరుమల(Tirumala) క్యూ లైన్లలో గంటల తరబడి వేచి చూసిన భక్తులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఈ క్రమంలో నరకయాతన అనుభవిస్తున్న భక్తులు ఆగ్రహం కట్టలు తెంచుకొని “డౌన్ డౌన్ టీటీడీ ఈవో శ్యామలరావు ” “డౌన్ డౌన్ చైర్మన్ బీఆర్ నాయుడు” అంటూ నినాదాలు చేశారు.
క్యూ లైన్లలో భక్తుల(Devotees)కు సౌకర్యాలు కల్పించడంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు(BR Naidu), ఈవో శ్యామలరావు(TTD EO Shyamala Rao) ఘోరంగా విఫలం అయ్యారని వైసీపీ(YSRCP) విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో అన్నప్రసాదం, పిల్లలకు పాలు, మంచి నీరు లేక అల్లాడుతున్నారు. వీఐపీ దర్శనాలతో బిజీగా ఉన్న ఈవో శ్యామలరావు మరియు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.. ఇప్పటికైనా స్పందించి సామాన్య భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు వైసీపీ ట్విట్టర్ వేదికగా పేర్కొంది.






