శ్రీవారి మెట్టు వద్ద రోడ్డు ప్రమాదం.. తీవ్రంగా గాయపడ్డ భక్తుడు

by Jakkula.Mamatha |   (  Updated:2025-04-21 06:16:36  IST  )

తిరుపతిలోని శ్రీవారి మెట్టు సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

శ్రీవారి మెట్టు వద్ద రోడ్డు ప్రమాదం.. తీవ్రంగా గాయపడ్డ భక్తుడు
X

దిశ,వెబ్‌డెస్క్: తిరుపతిలోని శ్రీవారి మెట్టు సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టైం స్లాట్ టోకెన్లు తీయిస్తామంటూ తిరుపతిలో 8 మంది భక్తుల(Devotees) వద్ద రూ.4 వేలు తీసుకుని ఆటోలో ఎక్కించుకున్నాడు. ఈ క్రమంలో సమయం ముగిస్తే భక్తుల వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాల్సి వస్తుందని వేగంగా డ్రైవింగ్ చేశాడు. ఈ తరుణంలో ఆ ఆటో ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించబోయి జీపును ఢీకొట్టింది. దీంతో ఆటోలోని ప్రయాణికులకు గాయాలు కాగా.. బెంగళూరుకు చెందిన భక్తుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. శ్రీవారి ఆలయంలో ఆటోవాలాల దందాను అరికట్టాలని భక్తులు కోరుతున్నారు. టైం స్లాట్ టోకెన్లు ఇప్పిస్తామని భక్తుల దగ్గర డబ్బులు తీసుకుని రైల్వే స్టేషన్ వద్ద ఆటోలో ఎక్కించుకుని వేగంగా వెళుతున్నారని పలువురు చెబుతున్నారు.

Next Story