తిరుమలలో ఘోరంగా వ్యాపారాలు.. భక్తుడి ఆవేదన వైరల్

by Vemula.Srinu Prasad |

తిరుమలలో దళారీ వ్యవస్థ నడుస్తోందని విజయవాడకు చెందిన భక్తుడు సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పార్టీల‌తో సంబంధం లేదని, భ‌క్తుడిగా ఫ్యామిలీతో తిరుమల వెళ్లానని ఆయన తెలిపారు...

తిరుమలలో ఘోరంగా వ్యాపారాలు.. భక్తుడి ఆవేదన వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమలలో దళారీ వ్యవస్థ నడుస్తోందని విజయవాడకు చెందిన భక్తుడు సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పార్టీల‌తో సంబంధం లేదని, భ‌క్తుడిగా ఫ్యామిలీతో తిరుమల వెళ్లానని ఆయన తెలిపారు. అయితే రూమ్ దందాలు, లాక‌ర్ దందాలు సామాన్య భ‌క్తుడికి అందుబాటులో లేకుండా ఘోర‌మైన వ్యాపారం జ‌రుగుతోందని ఆరోపించారు. విజిలెన్స్ వాళ్లు సైతం ఈ దందాలో భాగ‌స్వాములుగా ఉన్నారని తెలిపారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వంలోనే బాగుండేదని.. అప్పుడు టీడీపీ వాళ్లు ఆరోప‌ణ‌లు చేసి జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని భ్ర‌ష్టుప‌ట్టించారని వ్యాఖ్యానించారు. ఇక‌నైనా టీటీడీ పాల‌క‌మండ‌లి మేల్కోవాలని, . చైర్మ‌న్ వ్యాపార‌స్తుడు కాబ‌ట్టి భ‌క్తుల ప‌ట్ల శ్ర‌ద్ధ లేదని విమర్శించారు. కొండ‌పై జ‌రుగుతున్న దందాల‌పై జేఈవో ఆఫీస్‌లో లెట‌ర్ కూడా ఇచ్చానని భక్తుడు సుధాకర్ తెలిపారు.

Next Story