- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ. 200 కోట్లతో అమరావతిలో 4 స్టార్ దసపల్లా హోటల్.. ఉత్తర్వులు జారీ
అమరావతిలో అభివృద్ధి దూసుకుపోతోంది...

దిశ, వెబ్ డెస్క్: అమరావతిలో అభివృద్ధి దూసుకుపోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర రాజధానిలో పెట్టుబడులు పెట్టాలని వివిధ కంపెనీలను ఆహ్వానించారు. ఈ మేరకు పలు సంస్థలు ఇప్పటికే పెట్టుబడులు పెట్టాయి. తాజాగా రాజధానిలో పెట్టుబడులు పెట్టేందుకు హోటల్ దసపల్లా గ్రూపు ముందుకు వచ్చింది. రూ. 200 కోట్లతో 4 స్టార్ హోటల్ నిర్మించాలని దసపల్లా అమరావతి హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్ణయిచింది. ఈ మేరకు ప్రభుత్వంతో చర్చలు జరిపింది. ఇందుకు సానుకూలంగా స్పందన రావడంతో హోటల్ నిర్మాణం చేపట్టేందుకు రెడీ అయింది. ఈ దసపల్లా హోటల్ నిర్మాణంతో 400 మంది స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. పదేళ్ల పాటు రాష్ట్ర పన్నులు ,స్టాంప్ డ్యూటీ 100 శాతం తిరిగి చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. పరిశ్రమల తరహాలో విద్యుత్ చార్జీలు విధింపు ,5 ఏళ్లకు విద్యుత్ సుంకం తిరిగి చెల్లించాలని నిర్ణయం తీసుకోవడంతో పాటు టూరిజం పాలసీ 2024-29 ప్రకారం పలు రాయితీలు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు.






