10 లక్షల కోట్ల అప్పులున్నా.. హామీలన్నీ నెరవేరుస్తున్నాం..

by Thanuru Gopichand |

ఏపీకి పది లక్షల కోట్ల అప్పు ఉండి, లక్ష కోట్ల బిల్లులున్నా ఉన్న తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, పెన్షన్ల పెంపు పథకాలన్నీ అమలు చేస్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి మంత్రి పయ్యావులు కేశవ్​అన్నారు.

10 లక్షల కోట్ల అప్పులున్నా.. హామీలన్నీ నెరవేరుస్తున్నాం..
X

మంత్రి పయ్యావులు కేశవ్​

దిశ, డైనమిక్​ బ్యూరో/ అనంతపురం : ఏపీకి పది లక్షల కోట్ల అప్పు ఉండి, లక్ష కోట్ల బిల్లులున్నా ఉన్న తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, పెన్షన్ల పెంపు పథకాలన్నీ అమలు చేస్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి మంత్రి పయ్యావులు కేశవ్​అన్నారు. శుక్రవారం వజ్రకరూరు మండలం బొడిసానిపల్లి అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2019 ఎన్నికలకు ముందు మాజీ ముఖ్యమంత్రి జగన్ ఉరవకొండకి వచ్చి అధికారంలోకి వస్తే మూడు నెలల్లో హంద్రీనీవా పనులు ప్రారంభిస్తామని చెప్పారని, అయితే ఐదేళ్లలో ఒక గంప మన్ను తీయలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది లోపల ఆరు మోటర్ల నుంచి 12 మోటర్లకు వాడుకునేలా కాలువని రెండింతల సామర్థ్యానికి తీసుకువెళ్లడం జరిగిందని, అది తమ ప్రభుత్వానికి ఉరవకొండ నియోజకవర్గం అభివృద్ధి పట్ల ఉన్న చిత్తశుద్ధి అన్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేయడంలో రూపాయి ఎలా తీసుకురావాలి, ఎలా ఖర్చు పెట్టాలో నేర్పించే మహిళలే తనకు స్ఫూర్తి అని అన్నారు. రైతులు, మహిళల జీవితాల్లో మార్పు రావాలని లక్ష్యంగా కృషి చేస్తున్నామని, చెప్పినటువంటి మాటను ఎంత కష్టమైనా నిలబెట్టుకుంటామన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో అభివృద్ధిని ఇప్పటికే పరుగులు పెట్టిస్తున్నామన్నారు.

Next Story