రాజకీయంగా ఎన్ని ఇబ్బందులొచ్చినా రాజీ పడలేదు: మాజీ సీఎం జగన్

by Jakkula.Mamatha |   (  Updated:2025-07-01 08:56:46  IST  )

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

రాజకీయంగా ఎన్ని ఇబ్బందులొచ్చినా రాజీ పడలేదు: మాజీ సీఎం జగన్
X

దిశ,వెబ్‌డెస్క్: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ నేడు(మంగళవారం) తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ(YSRCP) యువజన విభాగం ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో యువజన విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, యువజన విభాగం జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాలు అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండడం రాజకీయాల్లో ఎంతో ముఖ్యమని మాజీ సీఎం జగన్ అన్నారు.

అందుకు సోషల్ మీడియా(Social Media)ను విస్తృతంగా ఉపయోగించాలని వైసీపీ యువ విభాగానికి సూచించారు. యూత్ వింగ్ అనేది పార్టీలో క్రియాశీలకమైంది. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని నిలదీయడంలో యువతది కీలక పాత్ర అన్నారు. ప్రజా సేవే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. ఈ తరుణంలో ఎన్ని కష్టాలు వచ్చినా.. విలువలు విశ్వసనీయతకు పెద్దపీట వేశామని తెలిపారు. ఈ నేపథ్యంలో రాజకీయంగా ఇబ్బందులు వచ్చిన తాను ఎప్పుడు రాజీపడలేదు అని వైఎస్ జగన్(Former CM YS Jagan) పేర్కొన్నారు.

Next Story