డీఎస్పీ జయసూర్య మంచి అధికారి.. పవన్‌కు ఎవరేం చెప్పారో: రఘురామకృష్ణరాజు

by Vemula.Srinu Prasad |

భీమవరం డీఎస్పీ జయసూర్యపై వచ్చిన ఆరోపణలపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్పందించారు..

డీఎస్పీ జయసూర్య మంచి అధికారి.. పవన్‌కు ఎవరేం చెప్పారో: రఘురామకృష్ణరాజు
X

దిశ, వెబ్ డెస్క్: భీమవరం డీఎస్పీ జయసూర్య(Bhimavaram DSP Jayasurya)పై వచ్చిన ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది. సివిల్ వివాదాల్లో కలుగజేసుకుంటున్నారని వచ్చిన ఫిర్యాదులపై ఎస్పీ నయీం అశ్మి(Sp Nayeem Asmi)ని డిప్యూటీ సీఎం పవన్ నివేదిక కోరిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు(Deputy Speaker Raghuramakrishna Raju) కీలక వ్యాఖ్యలు చేశారు. భీమవరం డీఎస్పీ జయసూర్య ఓ మంచి అధికారి అని తెలిపారు. జయసూర్యపై పవన్‌కు ఎవరేం చెప్పారో తనకు తెలియదన్నారు. గోదావరి జిల్లాల్లో పేకాట ఆడటం అనేది సహజమన్నారు. 13 ముక్కలాట నేరం కాదని తెలిపారు. కానీ పేకాటపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని చెప్పారు. కొంతకాలంగా భీమవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో పేకాట లాంటి జూదాలు జరగడం లేదని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.

Next Story