ఇప్పటికైనా రండి: జగన్‌కు రఘురామ ఆహ్వానం

by Vemula.Srinu Prasad |

ఇప్పటికైనా అసెంబ్లీకి రావాలని వైఎస్ జగన్‌కు డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు విజ్ఞప్తి చేశారు....

ఇప్పటికైనా రండి: జగన్‌కు రఘురామ ఆహ్వానం
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Ys Jagan Mohan Reddy) ఇప్పటికైనా అసెంబ్లీ(Assembly)కి రావాలని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు(Deputy Cm RaghuramaKrishnam Raju) విజ్ఞప్తి చేశారు. విశాఖ(Visakha)లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. వరుసగా 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడే అవకాశం ఉంటుందన్నారు. గత ఐదు సంవత్సరాల కాలంలో అసెంబ్లీ సమావేశాలు 67 రోజులు మాత్రమే జరిగాయని తెలిపారు. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా రెండేళ్లు అసెంబ్లీకి రాలేదని తెలిపారు. అయితే చంద్రబాబు రాని సమయంలో అసెంబ్లీ సమావేశాలు 37 రోజులు మాత్రమే జరిగాయని గుర్తు చేశారు. అసెంబ్లీకి రాకపోతే రాజ్యాంగం ప్రకారం ఆటో మేటిక్‌గా ఎమ్మెల్యేపై అనర్హత పడుతుందని రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు.

Next Story