RRR: సజ్జలపై ఉపసభాపతి రఘురామ ఫిర్యాదు

by Thanuru Gopichand |

వైసీపీ నేత, ఆ పార్టీ అధినేతకు సన్నిహితుడు అయిన సజ్జల రామకృష్ణారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని కోరుతూ శాసన సభ ఉప సభాపతి రఘురామకృష్ణమరాజు డీజీపీకి ఓ లేఖ రాశారు.

RRR: సజ్జలపై ఉపసభాపతి రఘురామ ఫిర్యాదు
X

ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలంటూ లేఖ

ఇప్పటికే అసభ్య వ్యాఖ్యల కేసులో కొమ్మినేని అరెస్టు

అజ్ఞాతంలోకి వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు

అనుచిత వ్యాఖ్యలతో అడ్డంగా బుక్ అవుతున్న వైసీపీ నేతలు

దిశ, డైనమిక్​ బ్యూరో : వైసీపీ నేత, ఆ పార్టీ అధినేతకు సన్నిహితుడు అయిన సజ్జల రామకృష్ణారెడ్డిపై (Sajjala) ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని కోరుతూ శాసన సభ ఉప సభాపతి రఘురామకృష్ణమరాజు (Raghurama) డీజీపీకి (Ap DGP) ఓ లేఖ రాశారు. భవిష్యత్​లో ఇలాంటి అవమానకర భాష ఎవరూ వాడకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సజ్జల వ్యాఖ్యలకు తన లేఖను ఉప సభాపతి జత చేశారు. భారతీయ శిక్షాస్మృతి ప్రచా రం చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. సజ్జల వ్యాఖ్యలు అమరావతిలోని వేలమంది మనోభావాలను దెబ్బతీసిందని ఆయన పేర్కొన్నారు. మహిళలను సంకర జాతి అంటూ వ్యాఖ్యానించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. కుల వివక్షకు సంబంధించిన పదం వాడిన సజ్జలపై చర్యలకు ఆయన డిమాండ్​చేశారు. వైసీపీ కార్యాలయంలో నిన్న సజ్జల విలేకరులతో మాట్లాడుతూ పిశాచాలు కూడా ఇలా చేయరేమో? అంటూ వ్యాఖ్యానించారు. వారిని రాక్షసులు అని కూడా అనలేం. అందరూ కలిసి సంకరం అయినట్టుంది. ఇవన్నీ కలిసి తయారైన తెగ ఏదో ఒకటున్నట్టుంది..’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

సాక్షి (Sakshi) డిబేట్​లో పాత్రికేయుడు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలతో ఇప్పటికే వైసీపీ మరక అంటుకుంది. మాకేం సంబంధం లేదంటూ వైసీపీ గగ్గోలు పెడుతోంది. ఆ వ్యాఖ్యలపై వెనువెంటనే చర్యలు చేపట్టిన పోలీసులు జర్నలిస్టు కొమ్మినేనిని అరెస్టు చేశారు. దీంతో అవాక్కయిన వైసీపీ పెద్దలు మాటలతో ఎదురుదాడికి దిగారు. ఈ నేపథ్యంలోనే ప్రెస్​మీట్​పెట్టిన సజ్జల అమరావతి ప్రాంత మహిళలపై మరోసారి నోరు జారారు. ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలేది లేదని కూటమి పెద్దలు హెచ్చరిస్తున్నారు. అక్రమంలోనే సజ్జలపై కేసు నమోదు చేయాలంటూ రఘురామ కృష్ణమరాజు డీజీపీ లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపున అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తన వ్యాఖ్యలను సమర్ధించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అమరావతిపై మరోసారి విషం చిమ్మిన జర్నలిస్టు కృష్ణంరాజు. పశ్చాత్తాపం లేకుండా మరోసారి వక్రబుద్ధిని ఆయన ప్రదర్శిస్తున్నారంటూ అమరావతి ప్రజలు, టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అనుచిత వ్యాఖ్యలతో వైసీపీ నేతలు అడ్డంగా బుక్​అవుతున్నారు.

Next Story