Deputy Speaker: టీడీపీకి బీజేపీ బంపర్ ఆఫర్.. ఆ ఎంపీని వరించనున్న డిప్యూటీ స్పీకర్ పదవి

by Kema Shiva Kumar |

లోక్‌సభ స్పీకర్ ఎన్నికపై గురువారం సస్పెన్స్ వీడింది. రెండోసారి బీజేపీ సీనియర్ నేత ఓ బిర్లా స్పీకర్ ఎన్నికయ్యారు.

Deputy Speaker: టీడీపీకి బీజేపీ బంపర్ ఆఫర్.. ఆ ఎంపీని వరించనున్న డిప్యూటీ స్పీకర్ పదవి
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ స్పీకర్ ఎన్నికపై గురువారం సస్పెన్స్ వీడింది. రెండోసారి బీజేపీ సీనియర్ నేత ఓ బిర్లా స్పీకర్ ఎన్నికయ్యారు. బీజేపీకి కొన్ని విపక్ష పార్టీలు సైతం మద్దతు ప్రకటించడంతో స్పీకర్ ఎన్నిక సజావుగా సాగింది. ఈ క్రమంలోనే డిప్యూటీ స్పీకర్ పదవిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సంప్రదాయం ప్రకారం డిప్యూటీ సీఎం పదవి తమకు ఇవ్వాలంటూ ఇండియ కూటమి పట్టుబడుతోంది. ఈ మేరకు ఆ పదవిని ఎలాగైన దక్కించుకునేందుకు అన్ని పార్టీ మద్దతును కూడగడుతోంది. అయితే, బీజేపీ మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి ప్రధాని మోడీ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. టీడీపీకి డిప్యూటి స్పీకర్ పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు ఢిల్లీలో పుకర్లు షికార్లు చేస్తున్నాయి. కాగా, ఇటీవలే బాపట్ల నుంచి ఎంపీగా విజయం సాధించిన మాజీ ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్‌కు డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ ఎన్డీయే కూటమిలో కీలకంగా మారింది. దీంతో ప్రధాని మోడి టీడీపీకి ఓ కేంద్ర మంత్రి, కేంద్ర సహాయ మంత్రి పదవులను కట్టబెట్టారు.

Next Story