- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pawan Kalyan : కేంద్రమంత్రులతో భేటీ కానున్న డిప్యూటీ సీఎం
రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా సాగుతున్న డిప్యూటీ సీఎం దిల్లీ పర్యటన.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) ప్రస్తుతం దిల్లీ (Delhi) పర్యటనలో ఉన్నారు. తన పర్యటనలో భాగంగా పలు కీలక సమావేశాలకు ఆయన హాజరుకానున్నారు. ఏపీ రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amith Shah), కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnav)తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. తన భేటీలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ ప్రాజెక్టులు, విభజన హామీల అమలు,రైల్వే కనెక్టివిటీకి సంబంధించిన అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ముఖ్యంగా ఏపీ ఆర్థిక పరిస్థితి, శాంతి భద్రతలు, మౌలిక సదుపాయాల కల్పనలో కేంద్ర సహకారం కోరనున్నారు. పిఠాపురం నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్త రైల్వే ప్రాజెక్టుల వేగవంతంపై అశ్విని వైష్ణవ్ తో చర్చలు జరపనున్నట్లు అధికార వర్గాలవారు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా సాగుతున్న ఈ పర్యటన అటు రాజకీయంగా, ఇటు అభివృద్ధి పరంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని కూటమి నేతలు అంటున్నారు. కేంద్రం నుంచి ఆశించిన నిధులు, సహాయ సహకారాల సాధనలో ఈ భేటీలు కీలక పాత్ర పోషిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.






