- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ap NeWs: పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
పంచాయతీరాజ్ శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు..

దిశ, వెబ్ డెస్క్: గిరిజన ప్రాంతాల్లో రహదారులు లేక ఇప్పటి ప్రజలు అల్లాడుతున్న విషయం తెలిసిందే. ఇక గర్భిణిల ప్రసవ వేదన అయితే చెప్పాల్సిన పని లేదు. ఆస్పత్రికి వెళ్లేలోపే పండంటి బిడ్డకు జన్మినిచ్చిన ఘటనలు సైతం ఈ రాష్ట్ర ప్రజలు చాలా చూశారు. ప్రభుత్వాలు మారుతున్నా ఇప్పటికీ గిరిజన ప్రాంత ప్రజలు డోలీ కష్టాలు పడుతూనే ఉన్నారు. దీంతో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, అటవీ పర్యావరణ శాఖపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ రోజు ఆ శాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
గిరిజన ప్రాంతాల్లో అడవిబాట పేరిట కొత్త రోడ్లు నిర్మించాలని.. ఇప్పటికే ప్రారంభించిన పనుల్లో వేగం పెంచాలని పవన్ సూచించారు. 625 గిరిజన ప్రాంతాలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించేందుకు చేపట్టిన పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. డోలీ రహిత ఏజెన్సీనే ప్రభుత్వ లక్ష్యమని, రోడ్ల నిర్మాణంపై నిరంతర పర్యవేక్షణ చేయాలని, రెండు వారాలకు ఒకసారి శాఖా పరంగా సమీక్షించి పురోగతిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం పీఎం జన్ మన్ పథకం ద్వారా రూ.555.6 కోట్లు నిధులు కేటాయించి సహకారం అందించిందని, జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను వినియోగించుకొంటున్నామని, ఇన్ని అవకాశాలు ఉన్నందున అడవి తల్లి బాట పనుల విషయంలో అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అధికారులకు సూచించారు. సవాళ్ళు, అవరోధాలు ఎదురైతే ప్రణాళికాబద్ధంగా అధిగమించాలని అధికారులను పవన్ కల్యాణ్ ఆదేశించారు.






