ఎంజీఆర్ కు డిప్యూటీ సీఎం ఘన నివాళి

by Thanuru Gopichand |   (  Updated:2026-01-17 07:31:17  IST  )

స్ఫూర్తిదాయకమైన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్.

ఎంజీఆర్ కు డిప్యూటీ సీఎం ఘన నివాళి
X

దిశ, వెబ్ డెస్క్ : భారతరత్న మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత పురచ్చి తలైవర్ ఎం.జి. రామచంద్రన్ (MGR) 109వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తమిళ చిత్రసీమలో నూతన ఒరవడిని సృష్టించి, తన జీవితాన్ని సామాన్యుల సంక్షేమం కోసం అంకితం చేసిన దార్శనిక నేత ఎంజీఆర్ అని కొనియాడారు. అధికారం అనేది కేవలం పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి తోడ్పడినప్పుడే దానికి నిజమైన అర్థం లభిస్తుందని ఎంజీఆర్ నిరూపించారని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. రాజకీయాల కంటే ప్రజలకు, సౌకర్యం కంటే న్యాయానికి పెద్దపీట వేస్తూ ఆయన అందించిన పాలన నేటికీ ఆదర్శప్రాయమని తెలిపారు. కరుణ, ధైర్యం, బాధ్యతతో కూడిన ఎంజీఆర్ పాలనా నమూనానే జనసేన పార్టీ అనుసరిస్తున్న నైతిక, ప్రజాకేంద్రీకృత రాజకీయాలకు స్ఫూర్తి అని ఆయన స్పష్టం చేశారు. ఎంజీఆర్ భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన ఆశయాలు, సేవా దృక్పథం ప్రజల హృదయాలలో కలకాలం నిలిచి ఉంటాయని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన సందేశంలో పేర్కొన్నారు.

Read More..

నేడు కాకినాడలో సీఎం.. డిప్యూటీ సీఎం పర్యటన

Next Story