మహా కుంభమేళాలో తొక్కిసలాట.. డిప్యూటీ సీఎం పవన్ స్పందన

by Jakkula.Mamatha |   (  Updated:2025-01-29 09:25:22  IST  )

ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradessh)లోని మహా కుంభమేళా (Maha Kumbhmela)లో ఈరోజు(బుధవారం) తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ (Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) స్పందించారు

మహా కుంభమేళాలో తొక్కిసలాట.. డిప్యూటీ సీఎం పవన్ స్పందన
X

దిశ,వెబ్‌డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradessh)లోని మహా కుంభమేళా (Maha Kumbhmela)లో ఈరోజు(బుధవారం) తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ (Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) స్పందించారు. ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 20 మంది భక్తులు దుర్మరణం పాలయ్యారని తెలిసి ఆవేదనకు లోనయ్యానని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ ఘటన దురదృష్టకరమని అన్నారు. మౌని అమావాస్య సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరించాలని కోట్ల మంది వచ్చిన క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకోవడం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి మహా కుంభమేళాకు వెళ్ళేవారు తగిన జాగ్రత్తలు పాటిస్తూ, ప్రభుత్వ అధికారుల సూచనలు అనుసరించాలని విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు.

ఈ క్రమంలో మృతుల కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. అదేవిధంగా క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. మహా కుంభమేళాలో నిన్న(మంగళవారం) అర్ధరాత్రి తొక్కిసలాట జరిగింది. త్రివేణి సంగమం (Triveni Sangam) వద్ద భక్తులు అమృత స్నానం చేసేందుకు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో ఘాట్ వద్ద బారికేడ్లు (Baricades) విరిగిపడటంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 20 మంది భక్తులు మరణించినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో గాయపడిన 50 మంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పారా మిలటరీ దళాలు (Para Military Forces), వాలంటీర్లు (Volunteers) అంబులెన్స్‌లో సమీపంలోని మహాకుంభ్ నగర్‌లోని సెంట్రల్ ఆసుపత్రి (Central Hospital)కి తరలించారు.

Next Story