- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్ర కేబినెట్ భేటీలో అరుదైన దృశ్యం.. అలా దర్శనమిచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కుర్చీ!(ఫొటో వైరల్)
ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) అధ్యక్షతన ఇవాళ(గురువారం) కేబినెట్ భేటీ(AP Cabinet Meeting) జరిగింది.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) అధ్యక్షతన ఇవాళ(గురువారం) కేబినెట్ భేటీ(AP Cabinet Meeting) జరిగింది. రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఈ క్రమంలో రాష్ట్ర మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేబినెట్ నిర్ణయించింది. అలాగే ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆమోదం తెలిపిన పరిశ్రమలకు భూ కేటాయింపుతో పాటు, రిజిస్ట్రేషన్ విలువల పెంపు సహా పలు కీలక అంశాలపై ఈ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదే విధంగా ఫిబ్రవరి 24 వ తేదీ నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. ఈ సమావేశానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) హాజరు కాలేదు. ఆయన వైరల్ ఫీవర్(Viral Fever)తో బాధపడుతున్నారు. తీవ్ర జ్వరంతో పాటు స్పాండిలైటిస్ సమస్యతో కూడా ఆయన ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర డిప్యూటీ సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అనారోగ్య కారణంగా వైద్యుల సూచన మేరకు పవన్ కళ్యాణ్ విశ్రాంతి(Rest) తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మంత్రివర్గ సమావేశంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాకపోయిన.. ఆయన సీటును మాత్రం సమావేశంలో ఖాళీగానే ఉంచారు. పవన్ కళ్యాణ కుర్చీలో మరెవరూ కూర్చోలేదు. దీంతో ఆయనకు కూటమి ప్రభుత్వం(AP Government) ఇచ్చే గౌరవం ఇదేనంటూ సోషల్ మీడియా(Social Media)లో ఈ ఫొటో వైరల్‌గా మారింది.






