- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pawan Kalyan:ట్రాక్టర్ నడిపిన డిప్యూటీ సీఎం పవన్
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) పేర్కొన్నారు.

దిశ,వెబ్‌డెస్క్: పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) పేర్కొన్నారు. గుంటూరు జిల్లా నంబూరులో ఇవాళ(శనివారం) పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ‘స్వచ్ఛత దివస్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. పారిశుద్ధ్యం తరలింపు వాహనాలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. దేశాన్ని గడగడలాడించిన మహమ్మారి కరోనా వంటి పరిస్థితుల్లో శుభ్రత గురించి తెలుస్తుందని తెలిపారు.
2047 వికసిత భారత్(Vikasith Bharath) లక్ష్య సాధనలో పరిశుభ్రత(Cleanliness) కీలకపాత్ర పోషిస్తుందన్నారు. మొదటగా డంపింగ్ యార్డ్ ఆవరణలో మొక్కలు నాటిన పవన్ కళ్యాణ్ చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంలో చేపట్టిన వర్మి కంపోస్టు తయారీ, ఇతర ఉత్పత్తుల్ని పరిశీలించారు. ఏ కార్యక్రమమైనా రాత్రికి రాత్రే అద్భుతాలు జరగవన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనకు ప్రజల సహకారం కూడా కావాలని విజ్ఞప్తి చేశారు. పారిశుద్ధ్య కార్మికులను సన్మానించిన పవన్ కళ్యాణ్.. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో సరదాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్రాక్టర్ నడిపారు.






