- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రామీణ అభివృద్ధి పై అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ మాటామంతీ
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉదయం 10:30 గంటలకు సీకే కన్వెన్షన్‌లో 'మాటామంతీ' కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

దిశ, వెబ్ డెస్క్: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) ఈ రోజు ఉదయం 10:30 గంటలకు సీకే కన్వెన్షన్‌లో 'మాటామంతీ' కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మూడు కీలక శాఖల అధికారులు, సిబ్బందితో ఆయన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. గ్రామాల్లోని ప్రధాన సమస్యలైన తాగునీరు, సాగునీరు, రోడ్లు, మురుగు కాలువల నిర్మాణంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. దీంతో పాటు ఉపాధి హామీ పథకం అమలు, పాఠశాల విద్య, నిరుద్యోగ సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనులపై కూడా దృష్టి సారించనున్నారు.
గ్రామీణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, ప్రత్యేకించి చెరువుల పునరుద్ధరణపై పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలను క్షేత్రస్థాయి అధికారుల నుంచి తెలుసుకొని, వాటి పరిష్కారానికి తక్షణ కార్యాచరణను రూపొందించడమే ఈ 'మాటామంతీ' కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ సమావేశం ద్వారా గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే అధికారులతో నిత్యం చర్చిస్తూ.. అభివృద్దికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.






