- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో తమిళనాడు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల్లో హీరో, టీబీకే పార్టీ అధినేత విజయ్ గెలుపొంది సీఎం పీఠాన్ని దక్కించుకున్నారు. దీంతో ఏపీలోని జనసేనను ఉద్దేశించి రకరకాలు విమర్శలు వినిపించాయి. విజయ్ పార్టీతో జనసేనను పొల్చుతూ ట్రోల్స్ సైతం చేశారు. అయితే ఆ విమర్శలన్నింటిపై తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తమిళనాడు రాజకీయాలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు రాజకీయాలు ఎంతో సాఫీగా సాగిపోయాయని, తనకు అసూయ కలిగేంత చక్కగా రాజకీయాలు సాగాయని కల్యాణ్ పేర్కొన్నారు. రాజకీయ పార్టీ నడపడం అంత ఈజీ కాదన్నారు. కులం గురించి మాట్లాడతానని తనను అంటున్నారని, మిగితా నాయకులు కులం గురించి మాట్లాడటం లేదా.? అని ప్రశ్నించారు. తాను ఎప్పుడైనా కులాలపై మాట్లాడానా అని నిలదీశారు. కులాల్ని రెచ్చగొట్టే మెంటాలిటీ మంచిది కాదన్నారు. గత్యంతరం లేక ఇంత ఓపికతో ఉన్నానని చెప్పారు. ఇకపై జనసేన కట్టుదిట్టంగా ఉంటుందని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.






