- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారమైనా మోస్తున్నాం: ఆటో డ్రైవర్ల సేవ పథకంపై పవన్ కీలక వ్యాఖ్యలు
భారమైనా మోస్తున్నామని ఆటో డ్రైవర్ల పథకంపై పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు..

దిశ, వెబ్ డెస్క్: ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆటో డ్రైవర్లను ఆదుకునేందుకు రూ. 15 వేలు ఇస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) అన్నారు. విజయవాడ(Vijayawada)లో ఆటో డ్రైవర్ల సేవ పథకాన్ని(Auto driver service scheme) సీఎం చంద్రబాబు(CM Chandrababu)తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల సమయంలోనే ఆటో డ్రైవర్ల గురించి ఆలోచించామని చెప్పారు. ఆటో డ్రైవర్లకు రూ. 15 వేలు భారమైనప్పిటికీ ఆనందంగా మోస్తున్నామని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. స్త్రీ శక్తి పథకంతో ఇబ్బందిపడుతున్న ఆటో డ్రైవర్ల కుటుంబాల్లో భరోసా నింపేందుకు ఈ పథకాన్ని ప్రారంభించినట్టు చెప్పారు.
‘‘గత ప్రభుత్వ హయాంలో వివిధ సందర్భాల్లో ఆటో డ్రైవర్లను కలిసినప్పుడు గ్రీన్ టాక్స్ తో పడుతున్న ఇబ్బందులు నా దృష్టికి తీసుకువచ్చారు. రహదారుల నిర్వహణ చేయకపోవడం వల్ల ఏ విధంగా నష్టపోతున్నది చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాదిన్నరలోపే ఆ సమస్యలకు పరిష్కారం చూపాం. గత ప్రభుత్వం వాహన మిత్ర పేరిట రూ. 10 వేలు ఇచ్చింది. ఇచ్చిన రూ. 10 వేలు రోడ్ల మీద గుంతలు పూడ్చకపోవడం వల్ల ఆటోలకు మరమ్మత్తులు చేయించుకోవడానికి కూడా చాలేవి కాదు అన్నారు. ఆ సమస్యను పరిష్కరించేందుకు అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ధప్రాతిపదికన రోడ్లకు మరమ్మత్తులు చేశాం. అవసరం ఉన్న చోట కొత్త రోడ్లు నిర్మించాం.’’ అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.






