రేపు తమిళనాడులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన

by Ajay Maddhiboyina |

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు తమిళనాడులో పర్యటించనున్నారు.

రేపు తమిళనాడులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన
X

దిశ, వెబ్ డెస్క్: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు తమిళనాడులో పర్యటించనున్నారు. మధురై జిల్లాలోని మురుగన్ సదస్సుకు పవన్ హాజరుకానున్నారు. ఈ సదస్సుకు లక్షలాది మంది సుబ్రమణ్యస్వామి భక్తులు విచ్చేయనున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ సైతం హాజరుకానున్నారు. ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్, యెగి ఆదిత్యానాథ్ ఈ సదస్సులో పాల్గొనడంపై డీఎంకే విమర్శలు కురిపిస్తోంది. మురుగన్ సదస్సు ఓ భక్తి కార్యక్రమం అని అలాంటి కార్యక్రమానికి రాష్ట్రంతో సంబంధం లేదని నేతలను ఆహ్వానించడం ఏంటని ప్రశ్నిస్తోంది. కుల, మత, భాష రాజకీయాలు చేసేందుకే పవన్ కల్యాణ్ యోగిని ఆహ్వానించారని విమర్శిస్తోంది. అసలు పవన్ కల్యాణ్‌‌కు తమిళనాడుతో సంబంధం ఏంటని ప్రశ్నిస్తోంది. ఆ ఇద్దరినీ ఆహ్వానించడం వెనుక బీజేపీ ఉద్దేశ్యం ఏంటో చెప్పాలని డిమాండ్ చేస్తోంది.

Next Story