- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బక్రీద్ వేళ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ షాకింగ్ ట్వీట్
బక్రీద్(Bakrid) పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) షాకింగ్ ట్వీట్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బక్రీద్(Bakrid) పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) షాకింగ్ ట్వీట్ చేశారు. ‘గోవులను పవిత్రంగా పూజించే సంస్కృతి ఉన్న సమాజం మనది. అటువంటి గోవులను వధించేందుకు చట్టాలు అంగీకరించవు. గో మాతలను సంరక్షించుకొనే దిశగా ఉన్న చట్టాలను అమలు చేయడంలో అధికార యంత్రాంగానికి ప్రజల సహకారం కూడా అవసరం. గో సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన బాధ్యత ఉంది. బక్రీద్ తరుణంలో కొందరు గోవులను దొంగ చాటుగా కబేళాలకు తరలించే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో ఇప్పటికే అధికారులు దీనిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయనున్నారు. వీరికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని ట్వీట్‌లో పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
గో సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలి
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) June 5, 2025
గోవులను పవిత్రంగా పూజించే సంస్కృతి ఉన్న సమాజం మనది. అటువంటి గోవులను వధించేందుకు చట్టాలు అంగీకరించవు. గో మాతలను సంరక్షించుకొనే దిశగా ఉన్న చట్టాలను అమలు చేయడంలో అధికార యంత్రాంగానికి ప్రజల సహకారం కూడా అవసరం. గో సంరక్షణపై ప్రత్యేక దృష్టి…






