- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘‘కూలీ’ అనే పదం వాడొద్దు’.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ఏపీలో అమరావతి (Amaravati)లోని సికె కన్వెన్షన్ హాల్లో(CK Convention Hall) జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ సభ (Panchayati Raj Day Event) ఇవాళ(గురువారం) ఘనంగా నిర్వహించారు.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో అమరావతి (Amaravati)లోని సికె కన్వెన్షన్ హాల్లో(CK Convention Hall) జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ సభ (Panchayati Raj Day Event) ఇవాళ(గురువారం) ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం, గ్రామీణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. మంగళగిరిలో జరిగిన జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవంలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పంచాయతీరాజ్ శాఖను చాలా ఇష్టంగా ఎంచుకున్నానని చెప్పారు. పల్లెల్లో ఉండడం అంటే తనకు ఇష్టమని తెలిపారు. పల్లె నిధులు వాటికే ఉపయోగించాలని చెప్పారు.
అధికారుల కృషితో గ్రామాల్లో వేగవంతమైన అభివృద్ధి సాగుతోందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. బిల్లులు రాక పోయిన పనులు చేసిన గుత్తేదారులకు డిప్యూటీ సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో ఉపాధి హామీ పథకంలో 75 లక్షల మందికి పైగా శ్రామికులు నిధులు ఇచ్చామని డిప్యూటీ సీఎం పవన్(Deputy CM Pawan Kalyan) పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకంలో ‘కూలీ’ అనే పదానికి బదులుగా గ్రామీణ వికాస శ్రామికుడు అనే పదాన్ని వాడాలని ఆయన సూచించారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గత వైసీపీ ప్రభుత్వ పాలన పై నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వం వల్ల గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. గతంలో చాలా తండాలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నానని తెలిపారు. అభివృద్ధి చేయాలని నిర్ణయించా.. ఈ క్రమంలో చిన్న పైరవీలు చేసినా చర్యలు తప్పవని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.






