- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాన్వాయ్ వల్ల పరీక్షకు ఆలస్యంగా వెళ్లిన విద్యార్థులు.. డిప్యూటీ CM పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) సోమవారం ‘అడవి తల్లి బాట’ కార్యక్రమంలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) సోమవారం ‘అడవి తల్లి బాట’ కార్యక్రమంలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించారు. అయితే పవన్ కల్యాణ్ కాన్వాయ్ కారణంగా పెందుర్తి అయాన్ డిజిటల్‌లో జేఈఈ మెయిన్స్ పరీక్షలు రాయాల్సిన కొంతమంది విద్యార్థులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి ఎగ్జామ్స్ రాయలేకపోయారని వీడియోలు, వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వ్యవహారంపై పవన్ కల్యాణ్ స్పందించారు. విద్యార్థులు పరీక్ష అందుకోలేకపోయిన పరిస్థితిపై విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. కాన్వాయి కోసం ఎంతసేపు ట్రాఫిక్‌ను నిలుపుదల చేశారు? పరీక్ష కేంద్రం దగ్గరకు విద్యార్థులు(AP Students) చేరుకోవలసిన మార్గాల్లో ఆ సమయంలో ఉన్న ట్రాఫిక్ పరిస్థితి ఏమిటి? సర్వీసు రోడ్లలో ఉన్న ట్రాఫిక్‌ను ఏమైనా నియంత్రించారా? లాంటి అంశాలపై విచారించాల్సిందిగా విశాఖపట్నం పోలీసులకు(Visakhapatnam Police) స్పష్టం చేశారు.
ఇక నుంచి తన పర్యటనల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. ‘కూటమి ప్రభుత్వంలో ముఖ్యుల పర్యటనల సందర్భంలో స్వల్ప వ్యవధి మాత్రమే ట్రాఫిక్ రెగ్యులేషన్ చేయాలని పోలీసులకు ఆదేశాలు ఉన్నాయి. అదే విధంగా పోలీసులు ట్రాఫిక్ రెగ్యులేషన్ చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులకు ట్రాఫిక్ అవాంతరాలు కలిగించే చర్యలు చేపట్టరాదని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు గతంలోనే ఇవ్వడమైనది. అందుకు అనుగుణంగానే ప్రతీ పర్యటన సందర్భంలో అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఈ విషయాన్ని తెలియచేస్తూ ఉంటాము. ఈ పర్యటనలో కూడా అధికారులు, ప్రజా ప్రతినిధులు అదే క్రమశిక్షణను పాటించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సైరన్ కూతలనూ కూడా తగ్గించి ప్రయాణిస్తారు’ అని సోషల్ మీడియా వేదికగా ఉప ముఖ్యమంత్రి కార్యాలయం(Office of the Deputy Chief Minister) పేర్కొన్నది.
విద్యార్థులు పరీక్ష అందుకోలేకపోయిన పరిస్థితిపై విచారణ చేయాలి. పెందుర్తి ప్రాంతంలో జె.ఈ.ఈ. పరీక్షకు కొందరు విద్యార్థులు అందుకోలేకపోవడానికి ఉప ముఖ్యమంత్రి కాన్వాయి కారణమని వచ్చిన వార్తా కథనాలను పరిగణనలోకి తీసుకొని వాస్తవ కారణాలను అన్వేషించి విచారణ చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి శ్రీ…
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) April 7, 2025






