- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతివారం పిఠాపురం నియోజకవర్గ(Pithapuram Constituency) అభివృద్ధిపై సమీక్ష చేయాలని నిర్ణయించారు. వేసవిలో నీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గురువారం అధికారులను ఆదేశించారు. పిఠాపురం నాలుగు పీఎస్‌ల పరిధిలోని పరిస్థితిపై ఇంటెలిజెన్స్ నివేదిక తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అవినీతికి పాల్పడుతున్న కొందరు పోలీసు అధికారుల మూలంగా పోలీసుశాఖ చులకన అవుతుందని అన్నారు.
శాంతి భద్రతల పరిరక్షణపై ప్రత్యేక దష్టి పెట్టాలని పోలీసు ఉన్నతాధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్(Pithapuram Development) అధికారులతో ఇవాళ నియోజవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై పవన్ కల్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పిఠాపురం – ఉప్పాడ రైల్వే గేటు వద్ద ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించామని అన్నారు. పిఠాపురంలో ప్రభుత్వ ఆసుపత్రిని సీహెచ్‌సీ నుంచి ఏరియా ఆసుపత్రి స్థాయికి పెంచాం.. అందుకు అనుగుణంగా రూ.38.32 కోట్లు నిధులు వచ్చాయని సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు.






