- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చారిత్రక మార్పు దిశగా భారత్: పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్
భారతదేశ గతిని మారుస్తున్న 'నారీ శక్తి'(Nari Shakthi) ప్రతి రంగంలోనూ అద్భుతాలు సృష్టిస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) అన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు బిల్లుపై పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. ...

దిశ, వెబ్ డెస్క్: భారతదేశ గతిని మారుస్తున్న 'నారీ శక్తి'(Nari Shakthi) ప్రతి రంగంలోనూ అద్భుతాలు సృష్టిస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) అన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు బిల్లుపై పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. చదరంగం గతుల్ని మార్చి చరిత్ర సృష్టించిన ఆర్. వైశాలీ విజయాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఫిడే ఉమెన్స్ క్యాండిడేట్స్ టోర్నమెంట్‌లో గెలిచి, ప్రపంచ ఛాంపియన్‌షిప్ బరిలో నిలిచిన తొలి భారతీయ మహిళగా వైశాలి నిలవడం గర్వకారణమని పేర్కొన్నారు. క్రీడల్లోనే కాకుండా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాలన, రీతూ కరిధాల్ శాస్త్ర సాంకేతికత, పీవీ సింధు, మీరాబాయి చాను, నిఖత్ జరీన్ వంటి వారు ఒలింపిక్ వేదికలపై భారత్ గర్వపడేలా చేస్తున్నారని పవన్ కల్యాణ్ ప్రశంసింశారు.
వారి కృషి వల్లే ఈ సాధికారత
ఈ సాధికారత వెనుక రాజ్యాంగ నిర్మాతలు దక్షాయణి వేలాయుధన్, హంసా మెహతా, దుర్గాబాయి దేశ్ ముఖ్ వంటి మహనీయుల కృషి ఉందని పవన్ గుర్తుచేశారు. వారి పునాదుల వల్లే నేడు మహిళలకు సమానత్వం, గౌరవం లభిస్తున్నాయని తెలిపారు. ఇదే స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'నారీ శక్తి వందన్ అధినియం-2026' బిల్లు.. శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా పాలనలో వారి భాగస్వామ్యాన్ని సుస్థిరం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ 2019 ఎన్నికల నుంచే ఈ రిజర్వేషన్లకు కట్టుబడి ఉందని, మహిళా సాధికారత తమకు కేవలం నినాదం కాదని, ఒక నిబద్ధత అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
ఆ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతా...
మహిళ ఎదిగితే దేశం ఎదుగుతుందనే సిద్ధాంతాన్ని తాను బలంగా నమ్ముతానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం అనేది వారికి కొత్త హక్కులు ఇవ్వడం కాదని, వారికి దక్కాల్సిన గౌరవాన్ని తిరిగి ఇవ్వడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. బలమైన మహిళలతో బలమైన కుటుంబాలు, తద్వారా పటిష్టమైన దేశం నిర్మితమవుతుందని పవన్ పేర్కొన్నారు. ఇకపై నారీ శక్తి అనేది కేవలం ఒక నినాదంగా కాకుండా, భారత నాగరికతకే ఒక బలమైన శక్తిగా నిలుస్తుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.






