- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తక్షణ నిర్ణయం.. నిమిషాల్లో రోడ్డు మంజూరు
మంగళగిరిలో ఈరోజు సాయంత్రం జరిగిన కానిస్టేబుల్ నియామక పత్రాల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: మంగళగిరిలో ఈరోజు సాయంత్రం జరిగిన కానిస్టేబుల్ నియామక పత్రాల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా నుండి కానిస్టేబుల్‌గా ఎంపికైన గిరిజన యువకుడు బాబురావు వేదికపైనే తన గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరాడు. దీంతో సీఎం చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. ఆ భాద్యత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకుంటాడని అన్నాడు. దీంతో ఆ యువకుడి విజ్ఞప్తి పై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సభ ముగిసేలోగానే రోడ్డు నిర్మాణానికి సంబంధించిన మంజూరును ప్రకటించి తక్షణ నిర్ణయం తీసుకున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో నిమిషాల్లోనే నిర్ణయం తీసుకునే తమ ప్రభుత్వ విధానాన్ని ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది.
కానిస్టేబుల్ బాబూరావు కోరిక మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లా, జీకే వీధి మండలం, దేవరపల్లి పంచాయతీ పరిధిలోని తెనుములబండ గ్రామానికి చెందిన బాబూరావు చెప్పిన వివరాల మేరకు పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తక్షణం రోడ్డు నిర్మాణానికి అవసరమైన అంచనాలు రూపొందించి, అనుమతులు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఉపముఖ్యమంత్రి ఆదేశాలతో ఆఘమేఘాలపై కదిలిన యంత్రాంగం తెనుములబండ నుంచి ఎలుగురాతిబండ వరకు 2 కిలోమీటర్ల మేర రూ. 2 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేసి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్ పరిపాలన అనుమతులు ఇచ్చారు. వేదిక మీద రోడ్డు గురించి విజ్ఞప్తులు చేయగా సభ ముగిసేలోగా రోడ్డు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంజూరు చేశారు. దీంతో అతనిపై సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.






