నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డిప్యూటీ CM పవన్ కల్యాణ్ కీలక ప్రకటన

by Gantepaka Srikanth |

రాష్ట్ర నిరుద్యోగులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో ఎన్డీయే(NDA Govt) పాలన ఏడాది పూర్తి చేసుకుంది.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డిప్యూటీ CM పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర నిరుద్యోగులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో ఎన్డీయే(NDA Govt) పాలన ఏడాది పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో ఈ రోజున(సోమవారం) కూటమి ప్రభుత్వం మొదటి వార్షికోత్సవ సభ జరుపుకుంటోంది. ఈ సభలో పాల్గొన్న పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా అడుగులువేస్తున్నామని కీలక ప్రకటన చేశారు. చంద్రబాబు అనుభవం, ముందుచూపుతోనే ఇది సాధ్యం కాబోతోందని తెలిపారు. ప్రధాని మోడీ సహకారంతో స్వర్ణాంధ్ర 2047 వైపు అడుగులు వేస్తున్నామని అన్నారు.

ఇప్పటికే రాష్ట్రంలో నిర్వహించిన యోగాంధ్ర గ్రాండ్ సక్సెస్ అయింది.. ప్రపంచ రికార్డు్ కూడా సృష్టించిందని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఒక్కొక్కటిగా పథకాలు అన్నీ అమలు చేస్తున్నామని అన్నారు. వచ్చి రాగానే.. రూ.3 వేలు ఉన్న పెన్షన్‌ను రూ.4 వేలకు పెంచామని తెలిపారు. డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించినట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం పథకాలకు సొంత పేర్లు ఉండేవి.. ఇప్పుడు ప్రముఖుల పేర్లు, సామాజిక సేవ చేసిన వాళ్ల పేర్లతో పథకాలు తీసుకొచ్చామని అన్నారు. ఏపీ బ్రాండ్‌ను పునరుద్ధరించి 9 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు సాధించినట్లు తెలిపారు. 9 లక్షల కోట్ల పెట్టుబడులతో 6 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించామని అన్నారు.

Next Story