- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు కోటప్పకొండకు పవన్ కళ్యాణ్.. షెడ్యూల్ ఇదే
ఇవాళ ఉదయం 10:30 గంటల ప్రాంతంలో పవన్ కళ్యాణ్ పల్నాడు జిల్లా పర్యటన ఉండనుంది.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పల్నాడు జిల్లా పర్యటన ఖరారైంది. ఇవాళ పల్నాడు జిల్లాలోని కోటప్పకొండకు పవన్ కళ్యాణ్ వెళ్ళనున్నారు. ఈ మేరకు స్పెషల్ హెలికాప్టర్ లో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోటప్పకొండకు చేరుకుంటారు. ఇవాళ ఉదయం 10:30 గంటల ప్రాంతంలో పవన్ కళ్యాణ్ పల్నాడు జిల్లా పర్యటన ఉండనుంది. ఈ సందర్భంగా కోటప్పకొండకు చెందిన త్రి కోటేశ్వర స్వామిని దర్శించుకుంటారు.
ఈ పర్యటన సందర్భంగా కొన్ని పర్యాటక ప్రాంతాల్లో కూడా పవన్ కళ్యాణ్ సందర్శిస్తారు. అనంతరం కోటప్పకొండ - కొత్తపాలెం మధ్య నిర్మించిన 3.9 కోట్ల రోడ్డును ప్రారంభించనున్నారు. ఆ తర్వాత మహాశివరాత్రి ఉత్సవాలపై పవన్ కళ్యాణ్ స్పెషల్ గా రివ్యూ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఉత్సవాలపై ఎలాంటి ఏర్పాట్లు చేయాలి.. భద్రత ఏర్పాట్లు ఎలా ఉండాలి అనే దాని పైన చర్చించనున్నారు. ఈ మేరకు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఖరారైంది.
Read More..






