ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే..?

by Vemula.Srinu Prasad |

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు...

ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే..?
X

దిశ, వెబ్ డెస్క్: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆయన షెడ్యూల్‌ను జనసేన పార్టీ అధికారికంగా ఖరారు చేసింది. ఈ నెల 25న జగన్నాథపురం లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులకు పవన్ కల్యాణ్‌కు శంకుస్థాపన చేయనున్నారు. రాజోలు నియోజకవర్గం కేశనపల్లిలో చనిపోయిన కొబ్బరి చెట్లను ఈ నెల 26న పరిశీలించనున్నారు. అనంతరం రైతులతో మాట్లాడనున్నారు. అదే రోజు శివకోటిలో పల్లె పండుగ 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇక 29న కాకినాడ సిటీ, పిఠాపురం నియోజకవర్గాలలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పాల్గొననున్నారు.

Next Story