- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు ఉడిపిని సందర్శించనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నేడు కర్ణాటక రాష్ట్రంలో పర్యటించనున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నేడు కర్ణాటక రాష్ట్రంలో పర్యటించనున్నారు. తన పర్యటనలో ప్రధానంగా ఉడిపిలోని (Udipi) ప్రసిద్ధ శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించనున్నారు. సందర్శనలో భాగంగా స్వామివారిని దర్శించుకోనున్నారు. పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం మఠాధిపతి పరమ పూజ్య శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ ఆహ్వానం మేరకు ‘బృహత్ గీతోత్సవ’లో పాల్గొని ప్రసంగించనున్నారు. భగవద్గీతలోని అంశాలను ప్రత్యేకంగా స్మరించుకునేందుకు, నేటి తరానికి భగవద్గీత గొప్పతనాన్ని వివరించేందుకు ఉడుపిలో ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఉడుపిలో పర్యటించి బృహత్ గీతోత్సవలో పాల్గొన్నారు. లక్షలాది మంది పాల్గొనే ఆదివారం నాటి కార్యక్రమానికి ఉప డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తారు.
ఈ ఆధ్యాత్మిక యాత్రకు ఆయన ప్రత్యేకంగా సమయం కేటాయించినట్టు తెలుస్తోంది. కాసేపట్లో గుంటూరు జిల్లాలోని మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి ఆయన బయలుదేరి కర్ణాటకకు పయనం కానున్నారు. డిప్యూటీ సీఎంగా, అలాగే చలనచిత్ర నటుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ కు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో కూడా భారీ సంఖ్యలో అభిమానులున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా ఉడిపిలోని అభిమానులు, పార్టీ శ్రేణులు ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి సిద్ధమవుతున్నారు. ఈ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమైన, ఆధ్యాత్మిక అంశాలకు సంబంధించినదిగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్శన ద్వారా ఆయన ఉడిపి సంస్కృతిని, ఆలయ చరిత్రను తెలుసుకునేందుకు కూడా డిప్యూటీ సీఎం ఆసక్తి చూపినట్లు సమాచారం. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పటికీ, తన వ్యక్తిగత ఆచారాలకు, ఆధ్యాత్మిక విషయాలకు పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత ఇస్తుంటారనే విషయం తెలిసిందే. ఈ మఠం సందర్శన అనంతరం ఆయన తిరిగి ఆంధ్రప్రదేశ్ కు తిరుగు పయనం అవుతారు.






