గన్నవరంలో సందడి.. గణతంత్ర వేడుకలకు సతీసమేతంగా హాజరుకానున్న డిప్యూటీ సీఎం

by Ramesh Naini |

రాష్ట్ర రాజధాని అమరావతిలోని పరేడ్ గ్రౌండ్స్‌లో రేపు (జనవరి 26న) నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు రంగం సిద్ధమైంది.

గన్నవరంలో సందడి.. గణతంత్ర వేడుకలకు సతీసమేతంగా హాజరుకానున్న డిప్యూటీ సీఎం
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర రాజధాని అమరావతిలోని పరేడ్ గ్రౌండ్స్‌లో రేపు (జనవరి 26న) నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు రంగం సిద్ధమైంది. ఈ వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఆయన సతీమణి అన్నా కొణిదెల పాల్గొననున్నట్లు అధికార వర్గాలు ప్రకటించాయి.

నాందేడ్ పర్యటన ముగించుకుని గన్నవరం రాక

మహారాష్ట్రలోని నాందేడ్‌లో నిర్వహించిన గురు తేగ్ బహదూర్ షాహిది సమాగమం కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం దంపతులు, ఆదివారం సాయంత్రం అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో అధికారుల నుంచి వారికి ఘన స్వాగతం లభించింది.

రిపబ్లిక్ డే వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

మహారాష్ట్ర పర్యటన ముగించుకుని నేరుగా విజయవాడ చేరుకున్న పవన్ కల్యాణ్, రేపు ఉదయం జరగబోయే అధికారిక వేడుకల్లో భాగస్వాములు అవుతారు. రాజధాని ప్రాంతంలో రిపబ్లిక్ డే వేడుకలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే జెండా ఆవిష్కరణ కార్యక్రమం నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.

Next Story