కాసేపట్లో అన్నమయ్య జిల్లాకు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

by Geesa Chandu |   (  Updated:2024-08-23 04:21:24  IST  )

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఈ రోజు అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు.

కాసేపట్లో అన్నమయ్య జిల్లాకు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఈ రోజు అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు. రైల్వే కోడూరు మండలంలోని మైసూరావారి పల్లె గ్రామ సభకు హాజరుకాబోతున్నారు డిప్యూటీ సీఎం. తదనంతరం అన్నమ్మయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడంతో దెబ్బతిన్న రాజంపేట మండలంలోని పులపత్తూరు గ్రామాన్ని పరిశీలించనున్నారు కల్యాణ్. అయితే ఇటీవలే అన్నమయ్య డ్యామ్ తెగడం వలన పులపత్తూరు గ్రామాన్నివరదలు ముంచెత్తాయి. ఈ గ్రామం తో పాటు చుట్టు పక్కల గ్రామాలను కూడా పరిశీలించనున్నారు. అయితే అన్నమయ్య జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటనతో.. ఇప్పటికే అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

Next Story