వనయజ్ఞం చేపట్టండి: పవన్ కల్యాణ్

by Vemula.Srinu Prasad |

ప్రతి గ్రామ పంచాయతీలోనూ దేశవాళి జాతి మొక్కలతో ప్రత్యేక వనాన్ని తయారు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు..

వనయజ్ఞం చేపట్టండి: పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రతి గ్రామ పంచాయతీలోనూ దేశవాళి జాతి మొక్కలతో ప్రత్యేక వనాన్ని తయారు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) అన్నారు. రాజనగరం(Rajanagaram)లోని అటవీ శాఖ ప్రాంతీయ పరిశోధన కేంద్రాన్ని(The Forest Department's Regional Research Centre) ఆయన పరిశీలించారు. మొక్కలను పెంచే బాధ్యతను గ్రామస్తులు తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రజలను భాగస్వామ్యం చేస్తేనే మొక్కల ఎదుగుదల సాఫీగా సాగుతుందని పవన్ కల్యాణ్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణ(Environmental Protection)తోపాటు దేశీయ మొక్కల(Native Plants)ను ఎక్కువగా పెంచితే ప్రకృతి సమతుల్యత సాధ్యమవుతుందన్నారు. వెంటనే దీనిపై దృష్టి సారించి పంచాయతీరాజ్ అధికారులు, అటవీశాఖ అధికారుల సంయుక్తంగా ఎంఓయు కుదుర్చుకొని వనయజ్ఞం చేపట్టాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

మన నాగరికత పరిఢవిల్లుతుంది..

"దేశీయ మొక్కలను నాటడం వల్ల పండ్లు, ఫలాలతోపాటు మన నాగరికత పరిఢవిల్లుతుంది. దీనికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. వచ్చే తరాలకు సైతం దేశీ మొక్కల వల్ల ప్రయోజనాన్ని తెలియజేయాలి. మొక్కలు పెంపకాన్ని పంచాయతీలు మంచి ఆదాయ మార్గంగా ఎంచుకోవచ్చు. కలప అతి తక్కువ సమయంలోనే లభించే మొక్కలు చాలా ఉన్నాయి. వాటిని బహిరంగ మార్కెట్ ద్వారా విక్రయించడం వల్ల పంచాయతీలు మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు. చాలా దేశాల్లో కలప కొరత ఉంది. పంచాయతీల్లో ప్రత్యేక వనాల ద్వారా ఆదాయాన్ని తెచ్చే మొక్కలను పెంచడం వల్ల మంచి ఫలితాలను సాధించవచ్చు. గ్రామాల్లో కూడా దేశీయ మొక్కలు నాటడాన్ని వాటిని సంరక్షించడాన్ని పిల్లలకు బాధ్యతగా నేర్పించాలి. ఇది వచ్చే తరాలకు చాలా ఉపయోగం’’ అని పవన్ కల్యాణ్ తెలిపారు.

Next Story