- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గవర్నర్ బడ్జెట్ ప్రసంగం రాష్ట్ర భవిష్యత్తుకు పునాది వేసింది : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
మూడోరోజు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం రాష్ట్ర బడ్జెట్ కు పునాది వేసిందని తెలిపారు.

దిశ, వెబ్‌డెస్క్: గవర్నర్ అబ్దుల్ నజీర్ బడ్జెట్ ప్రసంగం తనకు చాలా ప్రేరణను ఇచ్చిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై రెండోరోజు చర్చలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ బడ్జెట్ ప్రసంగం రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేసిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులకు ఫించన్లను పెంచామని పవన్ చెప్పారు. తల్లికి వందనం కింద రూ.10 వేల కోట్లు జమచేశామన్నారు. పీఎం జన్ మన్, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అడవితల్లి బాట పేరిట 625 గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ.. రూ.1005 కోట్లతో 1069 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టి.. సగంరోడ్లను పూర్తిచేశామని వివరించారు. గిరిజన ప్రాంతాల ప్రజల కోరికమేరకు రోడ్ల నిర్మాణాన్ని పూర్తిచేశాక వారి ముఖాల్లో కనిపించే ఆనందాన్ని మాటల్లో వివరించలేమన్నారు. రాష్ట్రంలో రైతులకు గత ప్రభుత్వం రూ.1674 కోట్ల ధాన్యం బకాయిలు చెల్లించలేదని పవన్ పేర్కొన్నారు. కానీ రైతులు భయపడాల్సిన పనిలేదని, ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు ఎప్పుడూ అండగా నిలుస్తుందన్నారు. కౌలు రైతులంతా ధైర్యంగా ఉండాలని సూచించారు.






